సినిమా ఇండస్ట్రీలో న్యూ టాలెంట్‌ను, టెక్నాలజీని ఎంకరేజ్ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. తొలిసినిమా అతనొక్కడేతో సురేందర్‌రెడ్డి, మల్లిఖార్జున్, నరేంద్ర, సునీల్ రెడ్డి, అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, కె.వి.గుహన్ ఇలా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నందమూరి కల్యాణ్ రామ్ తదుపరి సినిమాను కూడా కొత్త దర్శకుడితోనే చేయబోతున్నాడు. వశిష్ట అనే దర్శకుడు చెప్పిన కథ కల్యాణ్ రామ్‌కు బాగా నచ్చింది. ఫ్యామిలీ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే గుహన్‌తో కల్యాణ్‌రామ్ చేసిన 118 చిత్రం ఈ మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాతే కల్యాణ్ రామ్ తన తదుపరి సినిమా గురించి అధికారిక సమాచారాన్ని వెలువరుస్తారని సమాచారం. మరోవైపు విరించి వర్మ దర్శకత్వంలో కూడా కల్యాణ్ రామ్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!