Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మహేష్ బ్యాంకు రాబరీ చేసే క్యారెక్టర్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ టాటూ వేయించుకోవడం మాత్రమే కాక జుట్టు పెంచుకుని సరికొత్త మేక్ఓవర్ తో సినిమాకి రెడీ అవటం తో “సర్కారు వారి పాట” సినిమా కోసం మహేష్ అభిమానులు మాత్రమే కాక సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Mahesh Babu : కీర్తి సురేష్ హీరోయిన్ గా
ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తూ ఉంది. ఈ సినిమాకోసం కొద్దిగా లావు అవడానికి కూడా కీర్తి సురేష్ తాజాగా రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ బాబు మల్టీ లాంగ్వేజ్ సినిమా చేయటానికి లేడీ డైరెక్టర్ ఫిదా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు కొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ స్క్రిప్ట్ అని సరికొత్త టాక్. చాలావరకు స్క్రిప్టు మొత్తం అయిపోయిందని చివరిలో ఉందని మహేష్ తో పాటు స్టార్ హీరో అజిత్ కి కూడా సుధా స్క్రిప్టు సిద్ధం చేసినట్లు త్వరలోనే మహేష్ కి తన స్టోరీ వినిపించ బోతున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!