ఈరోజుల్లో స్టార్ హీరో సినిమాలను తెరకెక్కించే దర్శక నిర్మాతలను వేధించే సమస్యల్లో సినిమాకు సంబంధించిన ఫుటేజీ ముందుగానే లీకుల రూపంలో బయటకు రావడం. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఇలాంటి సమస్యలు వస్తుండటం దర్శకుడికి పెద్ద తలనొప్పిగా మారింది. రీసెంట్గా స్టార్ట్ అయిన మహేశ్ సినిమాకు కూడా ఇదే సమస్య తలెత్తింది. రీసెంట్గా మహేశ్ 26వ చిత్రం చిత్రీకరణ `సరిలేరు నీకెవ్వరు` కాశ్మీర్లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ ఆర్మీ లుక్‌లో ఎలా ఉండబోతారనేది అందరిలోనూ కాస్త ఆసక్తిని రేపిన విషయమే. అయితే మహేశ్ ఆర్మీఆఫీసర్‌గా లొకేషన్లో ఉండే లుక్‌ను ఒకటి ఇప్పుడు లీకైంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మరి దర్శకుడు అనీల్ రావిపూడి నిర్మాతలు ఈ లీకుల సమస్యకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే చాలా ప్రమాదమే ఉంది.
previous post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!