Mehreen Pirzada: టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ పిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.. కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది.. మధ్యలో మెహరీన్ కాస్త లేటుగా పెళ్లి చేసుకుంటుందని.. సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకొందని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది.. తాజాగా భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది..!!
“ఇకపై మా ఇద్దరి మధ్య కానీ, బిష్ణోయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి సంబంధం ఉంటదని స్పష్టం చేసింది మెహరీన్. ఈ విషయంలో తన మనస్సు చెప్పినట్లు నిర్ణయం తీసుకున్నానని.. ఈవిషయాన్ని తన బంధుమిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని” ట్వీట్ చేసింది మెహరీన్.. అయితే ఎందువల్ల ఈ వివాహం రద్దు చేసుకుంటున్నారో తెలుపలేదు.. ఈ విషయంపై బిష్ణోయ్ కమ్యూనిటీ వారు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మెహరీన్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 లో నటిస్తోంది.
— Mehreen Pirzada? (@Mehreenpirzada) July 3, 2021