అడవిలో జంతువులు మాట్లాడటం, ప్రేమని చూపించటం, స్నేహం చేయటంలాంటి సీన్స్ చాలా థ్రీల్లింగ్గా ఉంటాయి. కాని నిజజీవితం లో జరగవు. కాని డిస్నీ లోకంలో మాత్రం అది సాధ్యమవుతాయి..క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదైనా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్నీ తయారు చేసిన `ద లయన్ కింగ్` అనే సినిమా కథ. డిస్నీ కథలకి పిల్లల్లో పెద్దల్లో చాలా క్రేజ్ వుంటుంది. ఈ క్రేజ్ అంతా డబుల్, త్రిబుల్ చేయటానికి ఈ పాత్రలకి సూపర్‌స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పించి మరింత ఆకట్టకుంటున్నారు.
వరుస చిత్రాల విజయాలతో దూసుకుపోతూ నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని ఇప్పడు `ద లయన్ కింగ్`లోని సింబా పాత్రకి డబ్బింగ్ చెప్పటం విశేషం. `జెర్సీ`లాంటి బ్లాక్‌బస్టర్ సాధించిన తరువాత ప్రస్తుతం `గ్యాంగ్‌లీడర్`, `వి` లాంటి వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలు చేస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా కూడా డిస్ని లాంటి ప్రపంచ ప్రఖ్యాత గాంచిన డిస్నీ లాంటి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లయన్‌కింగ్ లో హీరో పాత్ర సింబా కి డబ్బింగ్ చెప్పటం తెలుగు ప్రేక్షకులకి లయన్‌కింగ్ మరింత దగ్గరయ్యింది.
`ద లయన్ కింగ్`లో సింబానే హీరో ఈ పాత్ర చాలా ముఖ్యమైనది కూడా ఈ పాత్రకి హిందిలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇప్పడు తెలుగులో నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నారు. అలాగే ముసాఫా పాత్ర కి షారుక్ ఖాన్ చెప్పగా తెలుగులో జగపతిబాబు చెప్పారు. అలాగే పుంబా పాత్రకి బ్రహ్మనందం, టీమోన్ పాత్రకి ఆలీ డబ్బింగ్ చెప్పారు. ముఫార్ పాత్రకి పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. లయన్కింగ్ని డిస్నీ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పాత్రకి సూపర్‌స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు.ఎంతో కేర్ తీసుకుని మరీ చేస్తున్నారు. కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమాగా `ద లయన్ కింగ్` జూలై 19న విడుదల అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ – డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన `అవెంజర్స్ ఎండ్ గేమ్` బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!