Narne Nithiin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస రావు తనయుడు నితిన్ చంద్ర నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన సినీ రంగ ప్రవేశం గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు నితిన్ చంద్ర తొలి సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో `శ్రీశ్రీశ్రీ రాజావారు` నితిన్ చంద్ర డబ్యూ రూపుదిద్దుకుంటోంది.
గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని నార్నే శ్రీనివాసరావు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా మేకర్స్ నితిన్ చంద్ర ఫస్ట్ లుక్ను రివిల్ చేస్తూ టైటిల్ను కూడా ప్రకటించారు.
పెరిగిన గడ్డంతో సిగరెట్ కాల్చుతూ రఫ్ లుక్లో దర్శనమిచ్చిన నితిన్ చంద్ర బాగానే ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఇప్పుడీయన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. మరియు ఎన్టీఆర్ బావమరిది కావడంతో.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారని సమాచారం.
కాగా, టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ సినిమా `తీవండి` ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నప్పటి నుంచి ధూమపానానికి అలవాటు పడ్డ ఒక యువకుడు తన ప్రేమను గెలిపించుకోడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. మరి తొలి ప్రయత్నంలోనే నితిన్ చంద్ర సక్సెస్ అవుతాడా.. లేదా.. అన్నది చూడాలి.
It is #SriSriSriRajaVaaru 👑#SSSRFirstLook #NN1 pic.twitter.com/x6afTEDZoV
— Narne Nithiin (@NarneNithiin) March 18, 2022
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!