కాన్సెప్ట్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది. ఆ క్రమంలో చిన్న బడ్జెట్ చిత్రంగా కొత్త నటీనటులు, డెబ్యూ డైరెక్టర్తోరూపొందిన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`. ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. ఇప్పుడు నవీన్ హీరోగా మరో సినిమాకు రంగం సిద్ధమైంది. `పిట్టగోడ` ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా అనే హైదరాబాదీ అమ్మాయిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్‌గా ఉన్న ఫరియా త్వరలోనే టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
new heroine for navin polishetty, agent sai srinivasa atreya, navin polishetty, anu deep, faria abdullas
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!