కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం `118`. కె.వి.గుహన్ దర్శకుడు. మహేష్ కొనేరు నిర్మాత. ఈ సినిమా మార్చి 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నివేదా థామస్ మాట్లాడుతూ “జై లవకుశ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాను. అందుకు కారణం చదువే. ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ కారణంగా ఏ సినిమా ఒప్పుకోలేదు. హీరో కల్యాణ్ రామ్‌ను ఓ కల వెంటాడుతుంటుంది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఎదురైన పరిస్థితులేంటి? మెడికల్ టర్మ్‌లో జరిగిన మిరాకిల్ ఏంటి? నా పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు గుహన్‌కి కలగా వచ్చిన ఘటనలను ఆధారంగా చేసుకుని కల్పితంగా ఈ కథ రాశారు. నా పాత్ర చివరి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కల్యాణ్‌రామ్‌గారు చక్కగా నటించారు. సినిమాను గుహన్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే నాకు నేనే పోటీ. నాకు నేనే పెద్ద విమర్శకురాలిని. అలాగే పాత్ర నిడివి కంటే పాత్రకున్న ప్రాధాన్యతనే చూస్తాను. చాలెంజింగ్‌గా అనిపించే పాత్రలనే చేస్తాను. తదుపరి బ్రోచెవారెవరురా, శ్వాస చిత్రాల్లో నటిస్తున్నాను. బ్రోచెవారెవరురా సినిమాలో నా పాత్ర కామెడీ ప్రధానంగా సాగుతుంది. తమిళంలో ఓ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి“ అన్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!