RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. అంతకు ముందు “బాహుబలి” తో ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” తో… మిగతా ఇండస్ట్రీకి సినిమా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ అయితే టాలీవుడ్ నుండి సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు వణికి పోతున్న పరిస్థితి. ఎందుకంటె ఒకానొక టైంలో బాలీవుడ్ సినిమాలను చాలా చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే జక్కన్న “బాహుబలి” చెక్కడో.. బాలీవుడ్ బడాబాబులకు నోటి నుంచి మాటలు రావడం లేదు.
గత కొన్నాళ్ల నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే…ప్రపంచ మూవీ లవర్స్ రాజమౌళి గురించి చర్చించుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” తో మరోసారి తన పేరు ప్రపంచ సినీ లోకంలో డబల్ త్రిబుల్ గా రీ సౌండ్ వచ్చేలా రుజువు చేసుకున్నాడు. థియేటర్ లో “ఆర్ఆర్ఆర్” విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి టేకింగ్ కి జనాల నుంచి భారీ ఎత్తున స్పందన రావటం మాత్రమే కాదు వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్ లు రికార్డుస్థాయిలో రావటం.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే హిందీలో రిలీజ్ అయిన నాలుగో రోజుకి 100 కోట్ల మార్కును దాటేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్ ల గురించి తాజా ఇంటర్వ్యూలో.. యాంకర్ తారక్ నీ ప్రశ్నించగా… షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నెంబర్స్ అనేది నాకు సంబంధించి కాదు.
వస్తున్న కలెక్షన్లు నెంబర్ పెద్దదైతే.. ఆ వార్త వినబడితే కొద్దిగా పోస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. కేక్ మీద ఐస్ క్రీమ్ లాంటిది.. కలెక్షన్ల గురించి సినిమా అయిపోయాక నేను పెద్దగా పట్టించుకోను.. సక్సెస్ మాత్రం ఎంజాయ్ చేస్తా అంటూ ఎన్టీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేయడం జరిగింది. కొమరం భీమ్ పాటలో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు.. యావత్ దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచ సినీ ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోతున్నారు. “ఆర్ఆర్ఆర్” కి వస్తున్న కలెక్షన్లు ఓవరాల్ గా చూసుకుంటే… బాహుబలి ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!