స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో గత మూడు సీజన్ లతో నాలుగో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లైన అభిజిత్, మోనాల్, సోహైల్, అరియన, లాస్య మొదలైన కంటెస్టెంట్ లకు మంచి ఆఫర్లు రావడంతో ఎంతో బిజీగా అయిపోయారు. వీరందరికీ బిగ్ బాస్ మంచి జీవితాన్ని కల్పించిందని చెప్పవచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న మరో కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ హారిక కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా హౌస్ లో ఎంతో చాకచక్యంగా టాస్క్ లను పూర్తి చేస్తూ మరికొంత మంది అభిమానులను సొంతం చేసుకొని బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచారు.
బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన హారిక కూడా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో చేస్తున్న హారిక ఓ సినిమాలో చేయనున్నట్లు తెలిపారు. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోని కూడా రిలీజ్ చేస్తున్నట్లు హారిక స్పష్టం చేసింది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా నిలిచిన అరీయాన తెలుగులో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇక మోనాల్ స్పెషల్ సాంగ్స్ చేస్తూ, పలు టీవీ కార్యక్రమాలలో హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్ లకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!