OTT: సాధారణంగా ఓటీటీలో విడుదలైన సినిమాలు కొన్ని మాత్రమే ట్రెండింగ్ లిస్టులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని థియేటర్లలో పెద్ద ఆదరణ దక్కించుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీలో విడుదలయి మెప్పించాయి. అయితే మూవీస్ కే పోటీ ఇవ్వాలనుకున్న టాక్ షోలు ట్రెండింగ్ లో నిలబడడం ఇప్పుడు విశేషంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఓటిటి ఆహాలు ప్రేక్షకులకు గట్టి పోటీ ఇస్తూ రెండు టాక్ షోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ షోలు మరియు సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రేమలు:
మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ తెలుగులో సైతం రిలీజ్ చేశారు. ప్రేమలు సినిమా రెండు ఓటీటీలో ఏప్రియల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం, కన్నడ, హిందీ వర్షన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్ కాగా తెలుగు వర్షన్ మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
2. డీజే టిల్లు:
ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో మరో సాలిడ్ సక్సెస్ కొట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ అని మనందరికీ తెలిసిందే. టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో ఆహా ఓటీటీలో ఉన్న డీజే టిల్లు ట్రెండింగ్ లోకి వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ సినిమా టాప్ 2 ట్రెండింగ్ లో నిలిచింది.
3. చెఫ్ మంత్ర సీజన్ 3:
నిహారిక హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో చెఫ్ మంత్రా సీజన్ 3. ఈ టాక్ షోకు అతిథులుగా మై డియర్ దొంగ టీం అభినవ్ గోమటం, షాలిని విచ్చేసారు. ఇక వీరిద్దరూ వచ్చి సందడి చేసిన ఎపిసోడ్ 7 ఆహా ఓటిటిలో టాప్ 3 ప్లేస్ దక్కించుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానున్న మై డియర్ దొంగ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ షోలో పాల్గొన్నారు టీం.
4. సామ్ జామ్ టాక్ షో:
స్టార్ హీరోయిన్ సమంత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన టాక్ షో సామ్ జామ్. ఈ షో ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ప్రారంభించారు. 2021 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో టాప్ 4వ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక ఇలా వీటి తరువాత తంత్ర, ఫీల్ గుడ్ కామెడీ సినిమాలు నిలిచాయి. ప్రస్తుత కాలంలో ఓటీటీల హడావిడి చూస్తుంటే రానున్న రోజుల్లో స్టార్ హీరోలు కూడా ఓటీటీలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే లాగా కనిపిస్తుంది. ఎప్పుడో ముగిసిపోయిన కార్యక్రమాలని కూడా మళ్లీ ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు ప్రేక్షకులు. అలా వచ్చిన వే ఇవన్నీ కూడా. ఇక రానున్న రోజుల్లో ఓటీటీల హడావిడి ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!