I’m Not A Robot Web Series: ప్రస్తుత కాలంలో కొరియన్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదే క్రమంలో కొరియన్ వెబ్ సిరీస్ ను మన టాలీవుడ్ లో ఓటీటిల్లో విడుదల చేస్తున్నారు. కొరియన్ లో ఓటిటి ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్న తాజా సిరీస్ ఒయామ్ నాట్ ఏ రోబోట్. ఇది ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కొత్త పోస్టర్‌ను ఓటిటి ఫ్యాన్స్ తో పంచుకుంది.
ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను చాట్ చేస్తున్నట్లుగా స్క్రీన్ షాట్స్ తీస్తూ డిఫరెంట్ గా వెల్లడించారు. ఈ పోస్టులో ఆర్సిబి టీం పై సెటైర్స్ వేస్తూ ఐయామ్ నాట్ ఏ రోబో రిలీజ్ డేట్ చెప్పారు. 2017 లో రిలీజ్ అయిన ఈ కొరియన్ సిరీస్ ఐఎమ్‌డిబి లో 8 రేటింగ్‌ను దక్కించుకుంది. మొత్తం 32 ఎపిసోడ్స్ తో ఏడాది పాటు స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కొరియాలో అత్యధిక మంచి విలక్షణ సిరీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ ఏ రోజో సిరీస్ కు సీజన్ 2 కూడా రాబోతుంది. ఇటీవలే డైరెక్టర్ జంగ్ డే యూన్ ఈ విషయాన్ని ప్రకటించాడు.
ఫస్ట్ సీజన్లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉండగా.. సెకండ్ సీజన్లో మాత్రం యాక్షన్, బోల్డ్ రెంటింటి నీ మిక్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్ సిరీస్ లో యు సీయుంగ్ హౌ,చేసూ బీన్ కీలక పాత్రలు పోషించారు. జంగ్ డే యూన్ దర్శకత్వం వహించారు. హీరో హీరోయిన్ల రొమాన్స్, బోల్డ్ సీన్స్ ఓటిటి లవర్స్ ను మెప్పించాయి. మల్టీ మిలినియర్ అయిన ఓ బిజినెస్ మాన్ కు హ్యూమన్ ఎలర్జీ ఉంటుంది. మనుషులతో కలవకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతాడు.
అతడి లైఫ్ లోకి రోబో పేరుతో ఓ అమ్మాయి ఎలా వచ్చింది? రోబో గా భావించి ఆమెతో ప్రేమలో పడ్డ కోటీశ్వరుడికి ఆమె మనిషి అనే నిజం ఎలా తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఈ సిరీస్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎమ్ఐ త్రీ పేరుతో రీమేక్ అయింది. ఇక ఈ సిరీస్‌లో హన్సిక లీడ్ రోల్ చేసింది. మ్యుగేన్ రావు, శంత ను భాగ్యరాజ్ కీలకపాత్రను పోషించారు. తెలుగులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ రిలీజ్ అయింది. రోబో గా అందమైన అమ్మాయిగా హన్సిక ఈ సిరీస్‌లో డ్యూయల్ రోల్ చేసింది. ఇక కొరియన్స్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతాయని చెప్పుకోవచ్చు. ఇక కొరియన్ లవర్స్ ఈ సినిమాని తప్పనిసరిగా చూడండి. చూసి సంతృప్తి చెందండి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!