Tenant OTT Release: ప్రస్తుత కాలంలో కమెడియన్లు సైతం హీరోలుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా ఇప్పటికే అనేకమంది కమెడియన్స్ హీరోలుగా 2024లో తమ సినిమాలతో వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సత్య రాజేష్ హీరోగా నటిస్తున్న మరో మూవీ టెనెంట్. ఈ సినిమాను ముందుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్రీకరణ స్టార్ట్ చేశారు. కానీ ఇటీవల నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్యం రాజేష్ క్లారిటీ ఇచ్చాడు. సత్యం రాజేష్ మాట్లాడుతూ..” కథ చాలా బాగుంది. ఓటిటి కోసమే అనుకుని ఈ మూవీ చేస్తున్న క్రమంలో మూవీ అవుట్ ఫుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది.
అప్పుడు థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేసాం. అంతేకానీ పొలిమేర 2 సక్సెస్ రావడం వల్ల థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్న. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో 10 కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్ళాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశరు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా. నా సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్పినప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్ లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది.
సాహిత్య సాగర్ కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. నేను ఆర్టిస్టుగా చేస్తా. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్న.. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా. హీరో అంటే. కానీ నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్ లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్న. అందులో ఎలివేన్స్ ఉండవు కానీ.. కమర్షియల్ సినిమాల ఉంటుంది. క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 నిమిషాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. నేను అలాంటివి చేయను. కొంచెం పవర్ ఫుల్ గా ఉంటే చేయవచ్చు.
ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక. ఈ సినిమాలో ట్విస్టులు ఉండవు. కానీ సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతితో బయటకు వస్తారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో హీరోయిన్ గా మేఘా చౌదరి, చందన తదితరులు కీలక పాత్రలు పోషించారు ” అంటూ చెప్పుకొచ్చాడు సత్యం రాజేష్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలు విన్న వారంతా.. రెమ్యూనరేషన్ గురించి పనిచేయకుండా హార్డ్ వర్క్ గురించి పని చేస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్. రానున్న రోజులో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.