Rebel Moon 2 OTT: హాలీవుడ్ దిగ్గజ దర్శకులలో జాక్ స్నైడర్ కూడా ఒకరు. ఈయన దర్శకత్వంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమా రెబల్ మూన్ పార్ట్ 1 ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్. అయితే..జాక్ టేకింగ్ పై ఉన్న భారీ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయింది. ఒరిజినల్ గా మూవీ బాగున్నప్పటికీ జాక్ స్నైడర్ వంటి డైరెక్టర్ సినిమా కాదని పలు కామెంట్స్ వినిపించాయి. అలాంటి సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిందే రెబెల్ మూన్ పార్ట్ 2 ది స్కార్గివర్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. మొదటి పార్ట్ తో అసంతృప్తి చెందిన జాక్ అభిమానులు ఈ సినిమాతో హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే రెబల్ మూన్ 2 ట్రైలర్ అభిమానులను బాగా సప్రైజ్ చేసింది. సినిమాలోని యాక్షన్ సీన్స్, బిజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దీంతో సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. రెబల్ మూన్ మొదటి పార్ట్ గత ఏడాది డిసెంబర్లో నేరుగా ఓటీటీలో విడుదలైంది. మదర్ వరల్డ్ ను శాసించే ఆట్టికస్ నోబుల్ ను ఎదిరించేందుకు కోరా కొంతమంది తిరుగుబాటు దారులను కలుసుకుంటుంది. తిరుగుబాటుదారులను కలుసుకునే క్రమంలో ఏర్పడిన సమస్యలతో రెబల్ మ్యాన్ మొదటి భాగం ఉంటుంది. ఇందులో అట్టికస్ నోబుల్ చంపేశామని కోరా టీం అనుకుంటుంది. కానీ అట్టికాస్ నోబుల్ బతికే ఉన్న సీన్ తో రెబల్ మూన్ ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుంది.
నోబుల్ బతికున్న విషయం తెలుసుకున్న కోరా మదర్ వరల్డ్ నుంచి ప్రజలను కాపాడుకోవడం చేసే పోరాటంతో రెబల్ మూన్ స్కార్గివర్ ఉండనున్నట్లు తెలుస్తుంది. రెబల్ మూన్ 2 మూవీ ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 19 నుంచి అంటే రేపు నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏప్రిల్ 19 అర్ధరాత్రి నుంచే ఈ రెండవ భాగం తెలుగులోని ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక రెబల్ మ్యాన్ 2 ట్రైలర్ మాత్రం ప్రేక్షకులు మంచి అంచనాలను రేపింది. మొదటి పార్ట్ పై వచ్చిన విమర్శలకు సెకండ్ పార్ట్ గట్టి సమాధానం చెప్పేలాగా తెలుస్తుంది. మొదటి భాగం విడుదలయ్యాక మంచి రివ్యూలు రాకపోవడంతో రెండో భాగం ఎలా ఉండబోతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్ చాలా బాగుందని.. ఏప్రిల్ 19న అసలు కథ కోసం ఎదురు చూస్తున్నామని.. మొదటి సినిమా కంటే ఇంకా బాగా వస్తుందని ఆశించామని ఓ అభిమాని కామెంట్ చేశారు. మరి ఈ అంచనాలన్నిటిని ఈ మూవీ నిలబడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ మూవీ కనుక ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే దీనికి మూడవ భాగం కూడా రానుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుత కాలంలో ఓటీటిల హడావిడి బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం ఓటీటీల ద్వారా పోటా పడుతున్నారు. అలా ఓటీటీలలో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ లిస్టులో ఈ మూవీ కూడా చేరుతుందో లేదో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!