Gaami: కుర్ర హీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రం “గామి” సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. “గామి” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “గామి” ట్రైలర్ చూసిన తర్వాత ఈవెంట్ లో స్పెషల్ వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. అందరికంటే ముందే ఈ ట్రైలర్ చూసిన ప్రభాస్.. సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ..”గామి ట్రైలర్ నాకు బాగా నచ్చేసింది. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తుంది. విశ్వక్ సేన్ కూడా బాగా చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత నేనే కావాలని ఈ వీడియో మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాను. అంత బాగా నచ్చేసింది ట్రైలర్. మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు.
“గామి” ట్రైలర్ ఈవెంట్ లో.. ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8వ తారీకు రిలీజ్ కాబోతోంది. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ థియేటర్స్ రిలీజ్ చేయబోతుంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో అఘోరగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర చిత్రాల విషయంలో ప్రభాస్ ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తుంటారు.
ఈ క్రమంలో తన వంతుగా సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఇతర సినిమాల గురించి పోస్ట్ లు పెడుతుంటారు. గత ఏడాది యానిమల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మెంటల్ ఎక్కిపోయింది అన్నట్టు.. తనదైన శైలిలో స్పందన తెలియజేశారు. ఇప్పుడు విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ చూసిన తర్వాత కూడా అదే రీతిలో ప్రభాస్ స్పందించడం సంచలనంగా మారింది.
Darling #Prabhas wishing Team #Gaami
#GaamiShowreelTrailer pic.twitter.com/YgKL4XOSPq
— YATHI®️ (@ursyathi) February 29, 2024
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!