NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

Naga Panchami February 29 2024 Episode 292: మోక్ష బాబుని కాపాడుకోవాలంటే నాకు కొన్ని శక్తులు కావాలి అందుకు ఆ తల్లి కరుణ కటాక్షాలు నాకు కావాలి ఫణీంద్ర అని పంచమి అంటుంది. ఎన్నోసార్లు నీకు నాగదేవత అవకాశం ఇచ్చింది కానీ మమ్మల్ని అందరినీ నువ్వు మోసం చేస్తున్నావు అందుకే నీకు నాగదేవత ప్రసన్నం కాదు అని ఫణీంద్ర అంటాడు. కరాలి తన ప్రయోగం మొదలుపెట్టింది ఫణీంద్ర మోక్ష బాబు నీకు కాపాడుకోలేక పోతే నా స్రమంత వృధా అయిపోతుంది అని పంచమి అంటుంది. నాగ గండ0 నుంచి బయటపడ్డాడు ఇక వదిలేసి నాతో వచ్చేయి పంచమి అని ఫణీంద్ర అంటాడు. మోక్ష బాబు కి ఎలాంటి ప్రాణగండం లేదని తెలిసి సంతోషంగా ఉంటే గాని నేను రానని చెప్పాను అకరాలితో మోక్ష బాబుకి ప్రాణహాని ఉంది అందుకే నేను రాను అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights
Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

ఆ కరాలి ని పక్కనే ఉన్న నువ్వు తెలుసుకోలేవు అని ఫణింద్ర అంటాడు. కరాలి గురించి నీకు తెలుసా అని పంచమి అంటుంది. నీకు అవన్నీ అనవసరం పంచమి నీకు మోక్ష ప్రాణాలు ఎంత ముఖ్యమో నేను నాగదేవతకు ఇచ్చిన మాట అంతే ముఖ్యం నువ్వంటేనే నాతో బయలుదేరి వచ్చేయ్ పంచమి అని ఫణింద్ర అంటాడు. ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ పంచమి నాగలోకం రాదు అని మోక్ష అంటాడు. నీకు అవసరం లేదు మోక్ష అని ఫణింద్ర అంటాడు. ఉంది తను నా భార్య అని మోక్ష అంటాడు. కాదు తను మా నాగ లోకపు యువరాణి అని ఫణీంద్ర అంటాడు. తను నా భార్య నాకు తెలియకుండా ఎవరు తీసుకెళ్లలేరు అని మోక్ష అంటాడు. నేను తీసుకెళ్తాను అని ఫణీంద్ర అంటాడు.

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights
Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

నీ చేతనైతే తీసుకువెళ్ళు నేను చూస్తాను అని మోక్ష అంటాడు. మా యువరాణి ని తీసుకెళ్లడం నా ధర్మం అందుకోసం నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని ఫణీంద్ర అంటాడు. ఫణీంద్ర నీకు దండం పెడతాను మోక్ష బాబుని ఏమీ చేయకు అని పంచమి అంటుంది. అందుకే నువ్వు నాతో రా పంచమి అని ఫణింద్ర అంటాడు. తన రాదు ఇక నువ్ బయలుదేరు అని మోక్ష అంటాడు. నిన్ను చంపే పంచమిని తీసుకువెళ్తాను అని  ఫణీంద్ర అంటాడు. కోపం తెచ్చుకున్న పంచమి ఫణీంద్ర చంప పగలగొట్టి నిన్ను నేను క్షమించను ఫణీంద్ర నాగదేవతకు చెప్పి నీకు శిక్ష వేస్తాను అని పంచమి అంటుంది. నాగదేవత దగ్గర తేల్చుకుందాం పంచమి మోక్షని ఈ రాత్రికి చంపి నిన్ను తీసుకువెళ్తాను అని ఫణింద్ర అంటాడు. ఈ రాత్రికే మోక్ష చావుకి ముహూర్తం నిన్ను నాగ లోకానికి చేర్చే శుభముహూర్తం అని ఫణీంద్ర వెళ్ళిపోతాడు. ఆ మాట తట్టుకోలేని పంచమి స్పృహ తప్పి కింద పడిపోతుంది. పంచమి ని పట్టుకుని గుండెలకు హత్తుకుంటాడు మోక్ష. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights
Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

చిత్రా వేళ్ళకి తమలపాకులతో చిలుకలు చుట్టి భార్గవ్ అని రండి అని పిలుస్తుంది. ఇదంతా నిజమేనా నువ్వు ఇంతగా వయ్యారాలు వలకబోస్తున్నావంటే దేనికో టెండర్ పెట్టావు అనిపిస్తుంది అని భార్గవ్ అంటాడు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు జోబులు తడుముకుంటారు మీ మగవాళ్ళు మీ ఆస్తులని దోచేసినట్టు అని చిత్ర అంటుంది. ఈ చిలుకలు నా కోసమా నువ్వు తినడం కోసమా అని భార్గవ్ అంటాడు. మీకోసమే అంటూ సిగ్గుపడుతూ తినిపిస్తుంది చిత్ర. నేను చెప్పినట్టు వింటే మన లైఫ్ సూపర్ గా ఉంటుందండి అని చిత్ర అంటుంది. మంచి జరిగేది అయితే ఆలోచిస్తాను అదేంటో చెప్పు చిత్ర అని భార్గవ్ అంటాడు. మన పాప సిసి రా గురించే అని చిత్ర అంటుంది. తనకు ఏమైంది బాగానే ఉందిగా అని భార్గవ్ అంటాడు.పంచమి జ్వాలక్కా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావట్లేదు అందుకే నా మాట విని మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం వేరేగా వెళ్ళిపోయేలా ప్లాన్ చేయండి అని చిత్ర అంటుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో చిత్ర అని భార్గవ్ అంటాడు. మీరు వాళ్లను కదపండి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అని చిత్ర అంటుంది. బాగానే ఉంది కానీ వాళ్లేమంటారో చిత్ర అని భార్గవ్ అంటాడు. మీరు అవునంటే లైట్ ఆఫ్ చేస్తాను పడుకోవచ్చు అని చిత్ర అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights
Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

పంచమి బాధపడుతూ ఉంటుంది. ఫణీంద్ర నీ కొట్టి తప్పు చేశాను మోక్ష బాబు అని పంచమి ఏడుస్తుంది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు పంచమి అని మోక్ష అంటాడు. ఆ ఫణీంద్ర నిన్ను చంపేసి నన్ను తీసుకు వెళ్తాను అంటున్నాడు అని పంచమి బాధపడుతుంది. నేనుండగా నిన్ను ఎవరు తీసుకెళ్లలేరు పంచమి అని మోక్ష అంటాడు. మీ ప్రాణాలు కాపాడడానికి సహాయం చేస్తే నాగులోకానికి వస్తానని మాట ఇచ్చాను మోక్ష బాబు అందుకే ఫణీంద్ర నన్ను రమ్మంటున్నాడు అని పంచమి అంటుంది.  నిన్ను తీసుకు వెళ్ళడానికి ఇక్కడ ఉంటున్నాడు అనుకున్నాను కానీ నువ్వు తనకు మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు కదా పంచమి తెలిస్తే నేను అందుకు ఒప్పుకునే వాడిని కాదు అని మోక్ష అంటాడు. నాగదేవత శాపానికి గురై కూడా మిమ్మల్ని కాపాడడానికి సిద్ధపడ్డాడు నేనే కరాలి భయానికి రానని వాయిదా వేస్తూ ఉంటే కోపం వచ్చి నిన్ను కాటేసి చంపేనా సరే నన్ను తీసుకు వెళ్తాను అంటున్నాడు అని పంచమి అంటుంది. నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకోను పంచమి అని మోక్ష అంటాడు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను అనుకున్న పని చేయడానికి నిర్ణయం తీసుకున్నకే ఆ మాట అన్నాడు మోక్ష బాబు అని పంచమి బాధపడుతుంది. ఏం కాదులే పంచమి నువ్వు ఊరుకో అని మోక్ష పంచమిని ఓదారుస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర నా భర్తని నువ్వే ఎలాగైనా కాపాడాలి అని పంచమి మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights
Naga Panchami Today Episode February 29 2024 Episode 292 Highlights

చిత్రవాళ్లు నీ బిహేవర్ ని చూసి భయపడుతున్నారు జ్వాల ఒకసారి డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అని వరుణ్ అంటాడు. అంటే నాకు పిచ్చి పట్టిందని మీరు అంటున్నారా అని జ్వాల అంటుంది. అనడం కాదు నీకు తెలియకుండా నువ్వే వేరే లాగా ప్రవర్తిస్తున్నావ్ కానీ నీకు ఆ సంగతి తెలియట్లేదు అని వరుణ్ అంటాడు. అలా ప్రవర్తించినప్పుడు వీడియో తీసి చూపించండి అని జ్వాల అంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ కలిస్తే బాగుంటుంది కదా అని వరుణ్ అంటాడు. మీరు ఇలా మాట్లాడితే ఇంకా పిచ్చెక్కిన దానిలా చేసి అందరిని భయపెడతాను అని జ్వాల అంటుంది..

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N