Prabhas: రాధే శ్యామ్ ..తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియన్ సినిమా. బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ఆ క్రేజ్ కారణంగా హాలీవుడ్ రేంజ్లో సాహో సినిమాను చేశాడు. అయితే, ఈ సినిమా బాలీవుడ్ జనాలకు మాత్రమే ఎక్కింది తప్ప మిగతా భాషలలో జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో హిందీ బెల్ట్‌లో తప్ప మిగతా అన్నీ సౌత్ భాషలలో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. ఇక ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం కూడా మైనస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి.
ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభాస్ మళ్ళీ రాధే శ్యామ్ సినిమాకు అదే ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ కుమార్‌కు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కోసం అందరూ దాదాపు నాలుగేళ్ళు శ్రమించారు. ఇటలీ, యూరప్ లాంటి దేశాలలో కరోనాను కూడా లెక్కచేయకుండా షూటింగ్ జరిపారు. ఇక అక్కడ వీలు కానీ సన్నివేశాలను మొత్తం 100 కు పైగా సెట్స్ వేసి ఇండియాలోనే షూటింగ్ పూర్తి చేశారు.
Prabhas: సాహో తర్వాత భారీ హిట్ కొట్టాలనుకున్న ప్రభాస్‌కు మళ్ళీ నిరాశే..!
అసలు మీడియా, మైక్ అంటే ఆమడ దూరం ఉండే ప్రభాస్ మొదటిసారి రాధే శ్యామ్ సినిమా కోసం ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లలో ప్రెస్ మీట్స్ నిర్వహించి సినిమా మీద హైప్ క్రియేట్ చేశాడు. ఎన్ని చేసిన లాభం లేకుండా పోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కథ, కథనాలే బలహీనంగా ఉన్నాయని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. మౌత్ టాక్ కూడా బాగోలేదు. సున్నితమైన ప్రేమకథకు అనవసరమైన హంగులు జోడించి ఎంత విజువల్ వండర్‌గా తీసిన బడ్జెట్ వేస్ట్ తప్ప ప్రభాస్ లాంటి కటౌట్‌కు ఇలాంటి కథలు నప్పవని అతని మార్కెట్ రేంజ్ సినిమా కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సాహో తర్వాత భారీ హిట్ కొట్టాలను కున్న ప్రభాస్‌కు మళ్ళీ నిరాశే అంటున్నారు.