NTR-Prabhas: ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో కన్నడ ఇండస్ట్రీ అంటే చిన్న ఇండస్ట్రీ గా భావించేవాళ్లు. అక్కడ చేసే సినిమాలు కూడా లో బడ్జెట్ కంటెంట్ ఉన్న మూవీస్ అని చెబుతుంటారు. అటువంటి కన్నడ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “కేజిఎఫ్” సినిమాలతో.. భారతదేశం మొత్తం కన్నడ సినిమా రంగం వైపు చూసేలా చేశాడు. “కేజిఎఫ్” రెండు భాగాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో తనతో పాటు హీరో యాష్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. “కేజిఎఫ్ 2” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అటువంటి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు పార్టు లుగా రాబోతోంది.
మొదటి భాగం వచ్చేసరికి సెప్టెంబర్ నెల 28వ తారీకు విడుదల చేయాలని భావించినా గానీ.. సీజీ వర్క్స్ సరిగ్గా కంప్లీట్ కాకపోవటంతో వాయిదా పడే పరిస్థితి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ “సలార్” సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు 2022వ సంవత్సరంలో తారక్ పుట్టినరోజు..ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఈ సినిమాని “కేజిఎఫ్”, “సలార్” సినిమాల కంటే.. ఉన్నతమైన నిర్మాణ విలువలతో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ కి విపరీతమైన మాస్ మాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. “RRR”తో ఎన్టీఆర్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఒక్కసారిగా ఎన్టీఆర్ క్రేజ్ దేశ విదేశాలలో విస్తరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ నీల్.. తారక్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారట.
అంతేకాదు ఈ సినిమాను “కేజిఎఫ్”, “సలార్” సినిమాల మాదిరిగానే రెండు భాగాలుగా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ ప్రాజెక్ట్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే రీతిలో స్టోరీ సిద్ధం చేస్తున్నారట. ఇందులో పాతకాలం రాజుల కాలం నాటి చరిత్రను కూడా చూపించబోతున్నట్లు మహారాజు పాత్రలో ఎన్టీఆర్ కి సంబంధించిన పాత్ర ఉండబోతున్నట్లు.. టాక్. “బాహుబలి” తరహాలో.. తారక్ సినిమా స్క్రిప్ట్ ప్రశాంత్ నీల్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే “సలార్” షూటింగ్ జరుగుతున్న సమయంలో.. తారక్ తో.. ప్రశాంత్ నీల్ చేయబోయే స్క్రిప్ట్ కొద్ది భాగం విని ప్రభాస్ వామ్మో అనీ నోరెళ్ళ బేట్టారట. స్క్రిప్ట్ మొత్తం వర్కౌట్ అయితే.. తారక్ కి కరెక్ట్ గా సూటైన కథ అని డార్లింగ్ ప్రభాస్ పొగిడినట్లు…బాహుబలి రికార్డ్స్ టార్గెట్ చేశారా అనీ అన్నాడట. సో ఈ రకంగా ప్రస్తుతం “సలార్” చేస్తూనే మరోపక్క ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పనులలో ప్రశాంత్ నీల్ బిజీ బిజీగా ఉన్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!