NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: కూతురు కోసం రాచమల్లు చేసింది తెలిసి, ఫోన్ చేసి మరీ మెచ్చుకున్న జగన్ !

Advertisements
Share

YS Jagan: పరువు హత్యలు జరుగుతున్న నేటి సమాజంలో ఓ అధికార పార్టీకి ప్రజా ప్రతినిధి చేసిన పని ఆదర్శవంతంగా నిలుస్తొంది. సదరు ఎమ్మెల్యే ప్రశంసలు అందుకుంటున్నారు. తమ కుమార్తెను ప్రేమించిన వాడు తమ మతం కాదు, తమ కులం కాదు. తమ స్థాయి కాదు అన్న కారణంతో వాళ్లను విడదీయడమో లేక ప్రేమించిన యువకుడిని హత్య చేయించడం, లేదా తమ కుమార్తెనే పొట్టనబెట్టుకోవడం లాంటి సంఘటనలు ఇంతకు ముందు సమాజంలో ఎన్నో జరిగాయి.

Advertisements

 

ఇటువంటి పరువు హత్యలు జరుగుతున్న పరిస్థితులు కొనసాగుతుండగా తమ స్థాయి, హోదా, కులం కాకపోయినా తన కుమార్తె ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించి ఆదర్శ ప్రాయుడుగా నిలిచారు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రాజమల్లు శివ ప్రసాద్ రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి ప్రొద్దుటూరుకే చెందిన కమ్మర లీలా గోపీ పవన్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడి కులం వేరు అయినప్పటికీ, ఆయన స్థాయి కాకపోయినప్పటికీ వారి ప్రేమను గౌరవించారు ఎమ్మెల్యే రాచమల్లు. వారికి ఆదర్శ వివాహం జరిపించారు.

Advertisements

 

ముందుగా బొల్లవరంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపించారు. అనంతరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వారికి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివే సమయంలో పవన్ కుమార్ ను ప్రేమించిందన్నారు. తన కుమార్తె ఇష్టప్రకారం తాను మనస్పూర్తిగా ప్రేమ వివాహం జరిపించానని చెప్పారు. పవన్ కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్ గా పని చేస్తున్నారని చెప్పారు. తన కుమార్తె ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని అన్నారు.

 

వాస్తవానికి ఈ వివాహం ఘనంగా చేయాలని తాను భావించినప్పటికీ తన కుమార్తె అందుకు ఒప్పుకోకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లల మనోభావాలు, అభీష్టాలను గౌరవించాలని ఈ సందర్భంగా సూచించారు. తనకు కులం, స్థాయి అన్న బేదాభిప్రాయాలు ఏమీ లేవనీ అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ఈ పనికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాచమల్లు చేసిన ఆదర్శ వివాహం గురించి తెలిసి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారని అంటున్నారు.

G 20 Summit: జీ 20 సదస్సులకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని ఢిల్లీ .. బ్రిటన్ ప్రధానిగా, భారత దేశ అల్లుడు రిషి సునాక్ సతీసమేతంగా..


Share
Advertisements

Related posts

అంబటి రాంబాబు స్కామ్ తేలకముందే..! వైసీపీ హయాంలో మరో పెద్ద స్కామ్..??

Special Bureau

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి

Mahesh

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

Srikanth A