ప్రభుదేవా, తమన్నా నటిస్తోన్న చిత్రం `కామోషి`. ఈనాడు ఫేమ్ చక్రి తోలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్ నేచురల్ థ్రిలర్ జానర్ మూవీ ఇది. ఇందులో ప్రభుదేవా కథానాయకుడు అయితే.. తమన్నా మాటలు రాని, మాటలు వినపడని అమ్మాయి పాత్రలో నటించింది. భూమిక కీలక పాత్రధారి. ఈ సినిమా మే 31న విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయమేమంటే… ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన మరో చిత్రం `అభినేత్రి 2` కూడా తెలుగు, తమిళంలో మే 31నే విడుదల కానుంది. అంటే ఇటు తెలుగు, తమిళం ఓ సినిమా.. అటు బాలీవుడ్లో మరో సినిమా ఓకే రోజున విడుదల కాబోతున్నాయి. `అభినేత్రి 2` చిత్రాన్ని ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించారు.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!