Premalu: ఇటీవల మలయాళం లో రూపొందిన రొమాంటిక్ అండ్ యాక్షన్ డ్రామా ” ప్రేమలు ” భారీ అంచనాలతో రిలీజ్ అయింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందుతుంది. లవ్ ట్రాక్ ఉన్న సినిమాలను నేటితరం యువతి ఎంతో విశేషంగా చూస్తున్న సంగతి తెలిసిందే.
వాటికి మంచి ప్రాధాన్యత సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక ప్రేమ కథలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇక అలా తెరకెక్కిన ప్రేమలు మూవీ మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ని కూడా దక్కించుకుంటుంది. నస్లెన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ప్రధాన పాత్రలలో నటించి మెప్పించిన ఈ మూవీ కి ప్రదీప్ సంగీతం అందించారు.
అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్ , మీనాక్షి రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించిన ఈ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్ పై దిలీష్ పోతన్, శ్యామ్ పుప్కరన్ల తో కలిసి ఫహద్ ఫాసిల్ గ్రాండ్ గా నిర్మించాడు. ఇక థియేటర్లో రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ యొక్క ఓటీటీ ఫ్లాట్ ఫారం కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. అదేవిధంగా ఈ మూవీని మార్చ్ 8న రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు భాషలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ తెలుగు రిలీజ్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!