Mahesh Babu: టాలీవుడ్ అందగాడు ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రస్తావన అవసరం లేదు. గాళ్స్ సర్కిల్ లో మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రిన్స్ అంటే ప్రాణాలిచ్చే డై హార్డ్ లేడీ ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన సొంతం. ఇక తాజాగా మహేష్ ఓ కవర్ పేజీకి ఇచ్చిన ఫోటో ఒకటి గాళ్స్ లో చర్చకు దారి తీసింది. ప్రముఖ మ్యాగజైన్ పీకాక్ కవర్ పేజీకి ఎక్కిన మహేష్ మరోసారి గాళ్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. లగ్జరీయస్ కారుపై కాలు పెట్టి స్టైలిష్ గా కవర్ పేజీ కోసం ఓ ఫోజు ఇచ్చాడు అంతే.. పాపలు ఢమాల్. బ్లాక్ కలర్ ప్యాంట్, షర్ట్ పై పువ్వుల డిజైన్ లెదర్ కోట్ ధరించి మిల్క్ బోయ్ ఒక్కొక్కరికి మతులు పొగొడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పారితోషికం కోట్లలో..
మహేష్ ప్రయివేట్ కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఏ హీరో కి లేనని ఎండార్స్ మెంట్ మహేష్ ఖాతాలో ఉండటం కొసమెరుపు. అందుకుగాను కోట్ల రూపాయాల పారితోషికాన్ని అందుకుంటున్నాడు అని ఓ సర్వే చెబుతుంది. ఇకపోతే సదరు ఫోటోని జతిన్ కాంపానీ క్యాప్చర్ చేయగా… రిజ్వాన్ అలీ, సల్లు హెయిర్ స్టైలిష్ గా పనిచేసారు. పీకాక్ అఫీషియల్ డిజైనర్ మహష్ ని ఇలా స్టైలిష్ గా మార్చి, మతులు పోగొట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు మహేస్ ని స్టైలిష్ లుక్ లో చూసి మురిసిపోతున్నారు. వీళ్లలో ఎక్కువగా గాళ్స్ ఉండటం విశేషం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా విశేషాలు:
ఇటీవలే మహేష్ ‘సర్కారు వారి పాట’తో ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ హ్యాట్రిక్ అందుకోగా, అదే వరుసలో సర్కారుతోనూ విజయాన్ని అందుకున్నారు. ఈ వియంతో మహేష్ ఇమేజ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. యూరప్ ట్రిప్ లో ఉన్ మహేష్ త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. అనంతరం పాన్ ఇండియాలో రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇది వచ్చే ఏడాది చివరిలో ప్రారంభం కానుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!