Nagababu: సాధారణంగా కొందరు యాక్ట్రెస్ తమ గొప్ప మనస్తత్వాన్ని చాటుకునేందుకు కొందరికి సాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ కోవా కి చెందిన వారే నాగబాబు కూడా. జబర్దస్త్ అనే కార్యక్రమానికి జడ్జిమెంట్ ఇచ్చే ఈయన అక్కడ ఉన్న కొందరికి సాయం చేసేవాడు కూడా. ఇక మెగా ఫ్యామిలీ లో నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో నాగబాబుకి మంచి పాపులారిటీ దక్కింది. అదేవిధంగా సినిమాలలో మంచి సక్సెస్ ని పొందకపోయినా ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించి కొద్దో గొప్పో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తన సినీ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు నాగబాబు.
ఇక తాజాగా నాగబాబుపై ఓ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన అవసరాలన్నీ నాగబాబు గారే తీర్చారంటూ గర్వంగా చెప్పుకుంది. మరి ఆమె మరెవ్వరో కాదు పింకీ. బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న పింకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె నాగబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” ఒకానొక సమయంలో నేను జీరో లో ఉన్న.. నాకు ఆ టైంలో నాగబాబు గారు పిలిచి చాలా సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ నాకు ప్రతి నెల శాలరీ లాగా వేసేవారు.
నేను ఏమీ చేయకపోయినా నాకు డబ్బులు ఇచ్చేవారు. మెడిసన్ కి మరియు బట్టలు కొనుక్కోవడానికి కూడా నాగబాబు గారే డబ్బులు పంపించేవారు. అదేవిధంగా నా హౌస్ రెంట్ కూడా ఆయనే కట్టేవారు. ఇలా ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు ఆయనే అన్ని చూసుకున్నారు. బహుశా ఆ టైంలో ఆయన లేకపోతే నా జీవితం ఇంతవరకు వచ్చేది కాదేమో. నాకు ఆ టైంలో నాగబాబు గారు దేవుడు లాగా అనిపించారు. అదేవిధంగా మాటీవీలో నేను ఇంకో కామెడీ షో చేయడానికి కూడా నాగబాబు గారే కారణం.
ఇక బిగ్ బాస్ కి వెళ్లేటప్పుడు నేను నాగబాబు గారికి చెప్పాను. నేను ఇలా బిగ్ బాస్ కి వెళ్తున్న సార్.. నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు పార్టిసిపేట్ చేయలేదు కొత్తగా ఉంది అని.. ఏం లేదు నువ్వు వెళ్ళు నేను ఉన్నాను కదా అని నాగబాబు గారు అన్నారు. ఇక నేను ఈ జన్మలో ఎవరిదైనా రుణం తీర్చుకోలేను అని అనుకున్న వారిలో అందులో మొదటి వ్యక్తి నాగబాబు గారు ” అంటూ కామెంట్స్ చేసింది పింకీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.