NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ‘రాధేశ్యామ్’ చూశాక ఎవరైనా శంకర్ సినిమాలను మర్చిపోవాల్సిందే..!

Radhe shyam: ‘రాధేశ్యామ్’ చూశాక ఎవరైనా శంకర్ సినిమాలను మర్చిపోవాల్సిందేనట. అవును ప్రస్తుతం ప్రభాస్ అభిమానులతో పాటు..ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇదే చర్చ సాగుతోంది. ఎందుకో తెలుసా..ఇందులో ఉన్న అద్భుతమైన వీఎఫ్ఎక్స్. ఈ సినిమాలో ఇప్పటి వరకు తెలుగు సినిమా స్క్రీన్ మీద చూడని విధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయట. అందుకు సంబంధించిన ఓ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, మొస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించారు.

radhe-shyam is fully a visual treat
radhe-shyam is fully a visual treat

ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు.. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్‌తో పాటు కృష్ణంరాజు, భాగ్యశ్రీ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా వచ్చి ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు విధికి ప్రేమకు మధ్య నలిగిపోయిన ఓ జంట ప్రేమకథ ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ ‘రాధేశ్యామ్’ సినిమా ఎలా ఉండబోతుందో జస్ట్ శాంపిల్ చూపించారు.

Radhe shyam: రోబో, ఐ లాంటి చిత్రాలను కూడా వీఎఫ్ఎక్స్ పరంగా ‘రాధేశ్యామ్’ మర్చిపోయేలా చేస్తుందట.

అయితే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన రోబో, ఐ లాంటి చిత్రాలను కూడా వీఎఫ్ఎక్స్ పరంగా ‘రాధేశ్యామ్’ మర్చిపోయేలా చేస్తుందట. అందుకు ఉదాహరణగా ఇందులో ఉన్న ఓ సాంగ్ అని అంటున్నారు. పూజా, హెగ్డే ప్రభాస్ మీద షూట్ చేయాల్సిన ఒక రొమాంటిక్ సాంగ్‌ను డేట్స్ సమస్య రావడం వల్ల క్లోజ్ షాట్స్ మిగతా పాట మొత్తం హీరో, హీరోయిన్ లేకుండా వారి డూప్‌లతో కంప్లీట్ చేశారట. ఇటీవల ఆ సాంగ్ లిరికల్ వీడియో కూడా వచ్చింది. కానీ, సాంగ్ చూసిన ఎవరికీ ఆ అనుమానాలు కలగనే లేదు. అంటే వీఎఫ్ఎక్స్‌తో దర్శకుడు, టెక్నికల్ టీమ్ ఎంత మాయ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక కేవలం ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు సినిమాలో మెజారిటీ భాగం ఇలాగే మెస్మరైజింగ్‌గా ఉంటుందట. అందుకే ‘రాధేశ్యామ్’ చూశాక శంకర్ సినిమాలను మర్చిపోతారని చెప్పుకుంటున్నారు.

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju