ఆధారాలుంటనే తాము ఓ పనిని చెప్పలేదనో, చేయలేదని చాలా మంది చెబుతుంటారు. ఇచ్చిన మాట నీళ్ల మీద రాతలుగా మారుతాయి. కానీ కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పరు. రెండో కోవకు చెందిన వ్యక్తే రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడి స్థాయికి ఎదిగిన లారెన్స్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. గుండె జబ్బులతో బాధపడే చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించడం, అనాథలకు ఆశ్రయం కల్పించడం సహా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుంటాడు. గత ఏడాది గజ తుపాను కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లోని ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. అందులో ఓ అవ్వ ఉన్న ఇంటిని కోల్పోయింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రాఘవ లారెన్స్ ఆ ముసలవ్వకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే ఏడాది తిరిగే లోపే ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చాడు.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!