కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలను సొంతం చేసుకున్న కుర్ర హీరో రాజ్ తరుణ్‌కి ఇప్పుడు సక్సెస్ కరువైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న లవర్ కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాజ్‌తరుణ్ ఓ టర్కీ సినిమాను చూశాడట. అతని నచ్చడంతో దిల్రాజును వెళ్లి కలిశాడు. దిల్‌రాజు కూడా టర్కీ సినిమా చూసి బాగుండటంతో తన బ్యానర్లో సినిమా చేయడానికి ఓకే అన్నాట్ట. అయితే చాలా పరిమితమైన బడ్జెట్లో మాత్రమే. రేపు సినిమా విడుదలై సక్సెస్ అయితే యూనిట్‌కు లాభాల నుండి వాటా దక్కుతుంది. లేదంటే లేదు. ఓ కొత్త దర్శకుడు సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌కు వెళుతుంది.
previous post
next post