Suma Kanakala : బుల్లితెరపై టాప్ యాంకర్ గా రాణిస్తున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాట తీరుతో, తన వేసే పంచులతో అందరినీ ఆకట్టుకుంటారు. బుల్లితెరపై ఏ ప్రోగ్రామ్ చూసిన అందులో మనకు సుమ కనకాల దర్శనమిస్తారు.
అందరి పై జోకులు వేస్తూ ఎంతో సరదాగా ఉండే సుమకి ఎప్పుడూ ఊహించనటువంటి అనుభవం ఒకటి ఎదురైంది.ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి క్యాష్ ప్రోగ్రాంకి బాలనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్టులు క్యాష్ ప్రోగ్రాం కు వచ్చారు.
ప్రస్తుతం టీనేజ్లో ఉన్న వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి పలు సార్లు క్యాష్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు. రాజన్న సినిమాలో ఎంతో ఫేమస్ అయిన అనీతో పాటు పలువురు క్యాష్ ప్రోగ్రాం కు వచ్చి ఎంతో సందడి చేశారు. సాధారణంగా సుమ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారిపై ఎక్కువగా పంచులు వేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లలు మాత్రం పిడుగులుగా మారి సుమ పై రివర్స్ పంచులు వేస్తూ ఎంతో సందడి చేశారు.
Suma Kanakala రాజీవ్ కనకాలతో కలిసి సినిమా చేశాను:
ఎంతో సరదాగా సాగుతున్న క్యాష్ ప్రోగ్రాంలో సుమ కి దిమ్మతిరిగే విషయం నటి అనీ తెలిపారు. రాజీవ్ కనకాల నాకు తండ్రి అవుతారని చెప్పడంతో సుమా ఎంతో షాక్ కి గురైంది. తర్వాత అనీ నేను రాజీవ్ కనకాల గారితో కలిసి ఓ సినిమాలో నటించాను. అందులో తన కూతురుగా నటించడం వల్ల తను నాకు తండ్రి అవుతారని చెప్పడంతో సుమతో పాటు అక్కడ ఉన్న వారందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నో చిత్రాలలో నటించిన కూడా రాజీవ్ కనకాల మంచి గుర్తింపును సంపాదించుకోలేక పోయారు. అయితే ప్రస్తుతం క్యాష్ ఏ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో మనం చూడవచ్చు. ఈ చిచ్చర పిడుగులు చేసే అల్లరిని, సుమా వేసే సెటైర్లు చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!