Deepthi Sunaina-Shanmukha : ప్రముఖ యూట్యూబ్ స్టార్ గా, మంచి పేరు సంపాదించుకున్న వారిలో షణ్ముఖ జశ్వంత్ ఒకరు.అదేవిధంగా యూట్యూబ్ లో డబ్ స్మాష్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలసి యూట్యూబ్ నటించడం,కొన్ని వీడియో సాంగ్స్ చేయడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వల్ల అక్కడ కంటెస్టెంట్ తనీష్ తోఎంతో చనువుగా ఉండేది. ఆ సమయంలో దీప్తి సునయన షణ్ముఖ బ్రేకప్ చేసుకొని తనీష్ తో లవ్ లో ఉన్నట్టు అందరూ భావించారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి షణ్ముఖ హర్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే తనపై వస్తున్న వాటిని ఖండిస్తూ తనిష్ ఒక క్లారిటీ ఇచ్చారు. దీప్తి సునయనతో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని, తను ఒక చెల్లెలు లాంటిదని తెలియజేశారు.దీప్తి సునైనా గురించి తనిష్ క్లారిటీ ఇచ్చినప్పటికీ వీరిద్దరి మధ్య దూరం ఉండటంతో వీరిద్దరూ విడిపోయారని భావించారు. కానీ తాజాగా స్టార్ మాలో ప్రసారమైన 100% లవ్ ప్రోగ్రాంకి రియల్ కపుల్ గా వీరిద్దరు హాజరయ్యారు.
ఇది పోయేవరకు తనపై ప్రేమ తగ్గదు:
తాజాగా షణ్ముఖ తన వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షణ్ముఖ తన చేతి పై ఉన్న టాటూను చూపిస్తూ, ఇది పోయే వరకు తన పైన ప్రేమ తగ్గదని దీప్తి సునయన పై ఉన్న ప్రేమను చెప్పకనే తెలియజేశాడు. అంతా సక్రమంగా జరుగుతున్న సమయంలో షణ్ముఖ ఒక ఆక్సిడెంట్ చేయటంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం సేవించి ఒకేసారి మూడు వాహనాలకు ఢీకొట్టడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.తనపై కేసు నడుస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న షణ్ముఖ ఇన్‌స్టా రీల్లో చిన్నప్పుడు తాను చేసిన ఓ షార్ట్ ఫిలిం వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దీప్తి సునయన కూడా షణ్ముఖ ఫోటోను షేర్ చేస్తూ నీ నవ్వును ప్రపంచం మార్చేలా చేసుకోకు. నువ్వే నీ నవ్వుతో ప్రపంచాన్ని మార్చు అన్న మెసేజ్‌ను దీప్తి ఇన్‌స్టా రీల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన ఫోటో, మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!