యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ఇటీవల తాను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని అది కూడా ప్రేమ వివాహమేనని తెలియజేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతూ ”నేను విజయవాడకు చెందిన అమ్మాయిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాను. తను ఓ వ్యాపారవేత్త. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో నా పుట్టినరోజు వేడుకల్లో తనను కలిశాను. ఇద్దరి అభిరుచులు కలిశాయి. అప్పటి నుండి మా ప్రేమకథ మొదలైంది. మా పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఒకరికి ఒకరం అనుకుంటున్నాం” అన్నారు.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!