Game Changer: చెన్నై వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్న అనంతరం మీడియాతో రామ్ చరణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు “గేమ్ చేంజర్” విడుదల గురించి ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నకు రాంచరణ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని తెలియజేశారు. సెప్టెంబర్ నెల ఆఖరిలో లేదా అక్టోబర్ తొలి వారంలో.. సినిమా విడుదల చేయొచ్చని రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఒకటి కలెక్టర్ మరొకటి స్టూడెంట్ ఇంకొకటి రాజకీయ నేతగా మూడు విభిన్నమైన పాత్రలలో గతంలో ఎన్నడు చేయని రీతిలో… చరణ్..”గేమ్ చేంజర్”..లో నటించడం జరిగింది. గేమ్ చేంజర్ విడుదల కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. RRR విడుదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. శంకర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపు యాడాదిన్నర నుండి జరుగుతుంది. గేమ్ చేంజర్ షూటింగ్ మొదలైన తరువాత అనుకోకుండా “ఇండియన్ 2” షూటింగ్ కూడా శంకర్ మొదలుపెట్టారు.
వాస్తవానికి 2020 కి ముందే కమలహాసన్ తో చేస్తున్న “ఇండియన్ 2” మూవీ 80% కంప్లీట్ అయింది. కానీ ఆ సినిమా నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి విభేదాలు రావడంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే గేమ్ చేంజర్ షూటింగ్ మొదలుపెట్టాక కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా హిట్ కావటంతో… “ఇండియన్ 2” మూవీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. దీంతో చరణ్ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ ఇప్పుడు చివరకి క్లైమాక్స్ కి చేరుకుంది. గత నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా “గేమ్ చేంజర్” నుండి జరగండి అనే సాంగ్ విడుదల చేయడం జరిగింది. సాంగ్ పరవాలేదు అనిపించింది. “RRR” తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ కెరియర్ లో “గేమ్ చేంజర్” 15వ సినిమా కావటంతో నిర్మాత దిల్ రాజు బడ్జెట్ లో ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. దీంతో సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోకంలో విడుదలవుతుందని చరణ్ తాజాగా కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.