తమిళ సినిమా రంగంలో కార్తీ హీరోగా “ఖైదీ” సినిమా తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు తమిళ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. దీంతో సినిమా డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ పై కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కన్ను పడింది. ఇప్పటికే ఓ తమిళ స్టార్ హీరో సినిమా కూడా లోకేష్ కనగారాజ్ తో ఫిక్స్ చేసినట్లు టాక్. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ యంగ్ డైరెక్టర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.
ఇప్పటిదాకా రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తూ కెరియర్ సాగించిన రామ్ చరణ్ లోకేష్ తో పని చేయటానికి తెగ ఉర్రూతలు పడుతున్నట్లు సమాచారం. లోకేష్ తెరకెక్కించిన రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ కావడంతోపాటు స్టోరీలో కొత్తదనం ఉండటంతో రామ్ చరణ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి సినిమా “RRR” షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్… ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే లోకేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరోపక్క లోకేష్ కూడా తమిళ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే రాంచరణ్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా స్టోరీ రెడీ చేసుకోవాలని లోకేష్ కి చెర్రీ ఆదేశాలు ఇచ్చినట్లు… అంతా ఓకే అయితే సినిమాను తానే నిర్మిస్తానని చరణ్ లోకేష్ కి చెప్పినట్లు టాక్.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!