Ravi Teja: `క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. ఇటీవల `ఖిలాడి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్‌గా నిలిచింది. అయినా రవితేజ జోరు తగ్గించలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒకటి. ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. దివ్యాంక కౌశిక్, రజిష విజయన్లు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ స్టార్ వేణు తొట్టెంపూడి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఓ ఎమ్మార్వో అవినీతి రాజకీయ నాయకులను ఎలా భరతం పట్టాడనే పాయింట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తిక అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. `రామారావు ఆన్ డ్యూటీ` డిజిటల్ రైట్స్‌ను ప్రముక ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సొంతం చేసుకుందట. ఈ విషయాన్ని సోనీలివ్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా తెలియజేశారు.
సరైన ఫిగర్ తెలీకపోయినా.. `రామారావు ఆన్ డ్యూటీ` ఓటీటీ రైట్స్ రికార్డు ధరే పలికిందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా టీజర్‌ను మహా శివరాత్రి కానుకగా మార్చి1న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!