Rashmika: ‘ఛలో’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ తెరకు పరిచయమైంది రష్మిక మందన. ఈ కర్ణాటక భామ గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె నటనాభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దర్శక నిర్మాతలు కూడా ఆమె వెంట పడ్డారు. అలా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. చూపు తిప్పుకోనివ్వని తన అందంతో ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
Rashmika: నిర్మాతలకు చుక్కలు
బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రష్మిక క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమెకు సంబంధించి ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటంటే ఈ మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ నిర్మాతలకు కొత్త కండిషన్స్ పెడుతోందట. ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు తన కండిషన్స్ కు ఓకే చెప్తేనే ముందడుగు వేస్తోందట. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా చేయాలంటే అది కంపల్సరిగా స్టార్ హీరో తీస్తున్న భారీ ప్రాజెక్ట్ అయ్యుండాలి అట. ఎలాంటి డిడక్షన్స్ లేకుండా అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సిందేనని రష్మిక స్పష్టం చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి కండిషన్లతో రష్మిక ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
రష్మిక నెక్స్ట్ ప్రాజెక్ట్స్
రష్మిక ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న తమిళ్ మూవీ ‘విజయ్ 66’లో ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది. హిందీలో మిషన్ మజ్ను’, గుడ్ బై, యానిమల్ సినిమాలు చేస్తున్న ఈ క్యూట్ యాక్ట్రెస్ మలయాళంలో ఓ రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ‘సీతా రామం’ అనే పేరుతో దీనిని తెలుగులో విడుదల చేయనున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!