RRR: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ కేజీఎఫ్ సీక్వెల్ వచ్చినా కూడా టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో క్రేజ్ కాస్త కూడా తగ్గడం లేదు. గత నెల 25న వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి అందరి అంచనాలను తారుమారు చేసింది. మొదటి రెండు వారాల్లోనే రూ 1000 కోట్ల వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ సినిమా రిలీజైనా కూడా ఆర్ఆర్ఆర్ ఇంకా దేశ వ్యాప్తంగా ఎక్కువ సెంటర్స్ లో ప్రదర్శింపబడుతూనే ఉంది.
ఇదే జోరు మరో వారం రెండు వారాల వరకు దేశ వ్యాప్తంగా ఈ సినిమా సందడి కనిపించడం గ్యారెంటీ అంటున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఆ తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ విదేశాలలో సందడి ఉంటుందని చిత్రంలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించాడు. ఎన్.టి.ఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు. వీరి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో పాటు రాజమౌళి స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ మరో స్థాయిలో సినిమాను నిలబెట్టాయి.
RRR: బాహుబలి చిత్రాల రికార్డ్స్ ఈ దెబ్బతో బద్దలవడం ఖాయం
అందుకే, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మరో 30 దేశాలలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఇతర దేశాలలో రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. చైనా, జపాన్ సహా మొత్తం 30 దేశాలలో ఆర్ఆర్ఆర్ రిలీజ్కు మేకర్స్ రెడీ అవుతున్నారు. బాహుబలి చిత్రాల రికార్డ్స్ ఈ దెబ్బతో బద్దలవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఆ సమయానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయా లేదా.