KGF 3: కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `కేజీఎఫ్ 2`ను రూపొందించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.
హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించగా.. రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో బాహుబలి చిత్రం తర్వాత ఆ స్దాయిలో సీక్వెల్ రిలీజ్ కోసం ఎదురుచూసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది కేజీఎఫ్ 2 నే. ఇక చివరాఖకు ఈ సినిమా విడుదల అవ్వగా.. అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
కథ అయితే పెద్దగా ఏమీ ఉండదు.. కానీ, హీరో ఎలివేషన్ సీన్స్‌తో పాటు యాక్షన్స్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తాయి. మొత్తానికి మాస్ ఆడియన్స్ ని రంజింపజేసే ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నెట్టింట మరో ఆసక్తికర టాక్ నడుస్తోంది.
అదే `కేజీఎఫ్ 3`. అవును, చాప్టర్ 2కు కొనసాగింపుగా పార్ట్ 3 కూడా ఉంటుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కేజీఎఫ్ పార్ట్ 3 కూడా ఉందా..? అని మీడియా వారు ప్రశ్నిస్తే.. అందుకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈరోజు రిలీజైన పార్ట్ 2 ఎండింగ్లో మాత్రం `కేజీఎఫ్ ఛాప్టర్ 3` లోడింగ్ అంటూ మేకర్స్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో కేజీఎఫ్ 3 సైతం ఉంటుందని అంటున్నారు. ఇది ఒక రకంగా యశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూసే అవుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!