RRR: ఇటీవలే ఆర్ఆర్ఆర్ మేకర్స్ యూఎస్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఉంది..త్వరలో దాన్ని రివీల్ చేయబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సర్ప్రైజ్ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ఇది. అయితే, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇలాంటి రిలీజ్ దక్కలేదనే విషయాన్ని తెలుపుతూ వారు ఈ సినిమా యూఎస్ రిలీజ్ గురించి గొప్పగా ట్వీట్లో పేర్కొన్నారు.ఇక డిస్ట్రిబ్యూటర్స్ సస్పెన్స్ లో ఉంచడంతో యూఎస్ సినీ ప్రేమికులు అంతా ఏంటి ఆ సర్ ప్రైజ్ అని ఆసక్తిగా ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆ సస్పెన్స్ రివీల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను యూఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. అంతేకాదు, డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ షోలను వేసేందుకు కూడా రెడీ అని తాజాగా ప్రకటించారు. దీనర్థం ఏమిటంటే ఒకే కమ్యూనిటీకి చెందిన వారు గానీ, ఒక ఫ్యామిలీకి చెందిన వారు గాని, స్నేహితులు గానీ.. ఇలా 40 మంది సంభ్యులు లేదా అంతకు ఎక్కువ మంది కలిసి స్పెషల్ షో కావాల నుకుంటే.. వారికి ఏ ప్రాంతంలో కావాలి.. ఎక్కడ సినిమాను చూస్తారు విషయం తెలియజేస్తే వెంటనే వారు కోరుకున్న సమయంలో షో ను అరేంజ్ చేస్తామని ప్రకటించారు.
RRR: ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్రను క్రియేట్ చేయడం గ్యారెంటీ..?
ఈ అద్భుతమైన అవకాశాన్ని భారీ స్థాయిలో యూఎస్ లో ఉన్న సినీ లవర్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో ఉండే తెలుగు ప్రేక్షకులు ఇతర ఇండియన్స్ ను కలవడం కోసం మంచి సందర్భాన్ని వెదుక్కుంటూ ఉంటారు. ఇది వారికి సరైన సమయం అని డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలుస్తారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ సూపర్ అనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్రను క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్.టి.ఆర్ కొమురం భీం గా నటించారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!