RRR: “బాహుబలి”(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యం లో… తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మించటం జరిగినట్లు టాక్. బాహుబలి తో తన సత్తా ఏంటో ఈ దేశానికి మాత్రమే కాక ప్రపంచానికి రాజమౌళి చాటి చెప్పటం తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
దీంతో ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది. 600 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ సినిమాకి పలు ఇండస్ట్రీ నుండి అనేక భారీ ఆఫర్స్ రావటం జరిగాయి. ఇదిలా ఉంటే వచ్చే నెల రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో భారీ ఎత్తున జరిగినట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటివరకు RRR కి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 1000 కోట్ల మార్కు దాటినట్లు..ఇన్ సైడ్ టాక్. ఒక బిజినెస్ విషయంలో మాత్రమే కాకుండా రిలీజ్ విషయంలో కూడా “RRR” హిస్టరీ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం.
ఇండియన్ సినిమా ఏ కాదు.. ఏ హాలీవుడ్(Hollywood) సినిమా రిలీజ్ అవ్వని విధంగా దాదాపు 10 వేల థియేటర్లలో “RRR” సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు అందుకు ఏర్పాట్లు ఎప్పటి నుండి ప్రారంభం అయినట్లు సమాచారం. పైన చెప్పిన లెక్కల ప్రకారం అన్ని వేల థియేటర్లలో రిలీజ్ అయితే కనుక డే వన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం.. మెగా నందమూరి అభిమానులతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లవర్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!