`భారతదేశం గర్వించే దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళిగారితో ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్య పిల్లల అదృష్టం తెలియదు.రెండు పెద్ద ఫ్యామిలీస్‌తో వచ్చిన ఇద్దరు సమ ఉజ్జీలైన హీరోలతో సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను“ అని అన్నారు నిర్మాత డి.వి.వి.దానయ్య RRR సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దానయ్య రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. “ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున అహ్మదాబాద్, పూణేలో 30 రోజుల షెడ్యూల్ ఉంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమాను 2020 జూలై 30 ప్రపంచ వాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం. వేరే భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. 10 ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం“ అని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!