సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. కానీ ఆయన హీరోగా నటిస్తారని అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోయింది. సల్మాన్‌ఖాన్, ఆలియా భట్ జంటగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌లీలాభన్సాలీ ప్రకటించిన చిత్రం `ఇన్షా అల్లా`. వచ్చే ఏడాది రంజాన్‌కు సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను తాత్కాలికంగా ఆపేసినట్లు ఇప్పుడు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అందుకు కారణాలను మాత్రం చెప్పలేదు. `ఇన్షా అల్లా ఆగింది. వచ్చే ఏడాది రంజాన్‌కు మరో సినిమాతో మీ ముందుకొస్తాను` అని సల్మాన్ ట్వీట్ చేశారు. ఆలియా మాత్రం దీని గురించి నోరు విప్పలేదు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!