Samantha: శాకుంతలం సినిమాకు పెద్ద మైనస్ సమంత..ఫస్ట్‌లుక్ తర్వాత ఇలాంటి కామెంట్స్ మొదలయ్యాయి. శకుంతల – దశ్యంతుడి ఎపిక్ లవ్ స్టోరీని డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. శాకుంతలం పేరుతో ఆయన తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్లో నటించారు. చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన రొమాంటిక్ స్టోరీ శకుంతల – దుశ్యంతుడి ప్రేమకథ కావడంతో అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి భారీగా అంచనాలున్నాయి. ఇక ఈ కథని ఇప్పటి తరానికి అందించాలనే పట్టుదలతో భారీ సెట్టింగ్స్.. అత్యంత భారీ బడ్జెట్‌తో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చారిత్రక చిత్రంలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. మరో విశేషం ఏమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ బాలనటిగా సిల్వర్ స్క్రీన్కు పరిచయం అవుతోంది. భరతుడు పాత్రలో ఈ క్యూట్ స్టార్ నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తైన ఈ సినిమా నుంచి అసలు అప్డేట్స్ రాకపోవడంతో శాకుంతలం సినిమా కొందరిలో సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతక ముందు గుణశేఖర్ మొదలుపెట్టిన విరాట పర్వం సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
Samantha: శకుంతల పాత్రకు ఆమె సూటవలేదనే విమర్శలు..!
ఇప్పుడు ఈ సినిమా కూడా డిలే అవడంతో రిలీజ్ అవుతుందా లేదా..అసలు శాకుంతలం సినిమా విషయంలో ఏం జరుగుతోంది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఆ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుందని మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా శాకుంతలం సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అభిమానుల్లో భారీ అంచనాలున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ తీవ్రంగా డిసప్పాయింట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. సమంత చాలా సన్నగా ఉందని శకుంతల పాత్రకు ఆమె సూటవలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి సినిమా రిలీజయ్యాక కూడా అదే టాక్ వినిపిస్తుందా లేక అభిమానులకు సర్ప్రైజ్ ఉంటుందా చూడాలి.