Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. 40 సంవత్సరాల వయస్సు దగ్గర పడుతున్న గాని హీరోయిన్ గా మాత్రం ఇంకా రానిస్తూనే ఉంది. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవడం జరిగింది. తెలుగు తో పాటు తమిళ సినిమా రంగంలో కూడా చాలామంది టాప్ హీరోలతో నటించింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసింది. ఆ టైంలో వరుస పెట్టి విజయాలు అందుకున్న తమన్న… తర్వాత మళ్లీ పరాజయాలు చూడటం జరిగింది.
ప్రస్తుతం తమన్నా ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసరికి సీనియర్ హీరోల సరసన హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇటీవల తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం చిరంజీవి నటించిన “భోళా శంకర్” సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. అంతకుముందు ఎఫ్ 3 సినిమా చేయడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కామెడీ పరంగా తమన్న పర్వాలేదనిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా తమన్నా సినిమాలు ఎంపిక విషయంలో సంచలన ప్రకటన చేసింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలలో నా పాత్రకు ఇబ్బంది లేకుండా హీరోయిన్ తగ్గించమని చాలా మంది దర్శకులతో డిస్కషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారిలో మార్పు రాకపోవడంతో రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయటం మానేశా. అంతేకాదు అటువంటి కంటెంట్ కలిగిన స్టోరీలకు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా సెలెక్ట్ చేయడం కూడా ఆపేశా అని తమన్నా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!