Tapsi: ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 2023 మొత్తం స్టార్ సెలబ్రిటీల పెళ్లి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇబ్బంది పడే వారంతా ప్రస్తుత కాలంలో పెళ్లిల్లిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్ తన ప్రియుడితో తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మరో ముద్దుగుమ్మ పెళ్లికి సిద్ధమయ్యింది. ఆమె మరెవరో కాదు తాప్సి. తెలుగు ఇండస్ట్రీలో ఈమెకి ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన తాప్సి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తాప్సి తన బాయ్ ఫ్రెండ్ మథియాస్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
వీరిద్దరూ దశాబ్దాల కాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సాంప్రదాయాల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మార్చ్ నెలలో వివాహం జరగనున్నట్లు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. తాప్సి ప్రియుడు వివరాల్లోకి వెళితే. ఆయన డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్.
ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించిన ఈయన డబుల్స్ లో నెంబర్ 1వ స్థానాన్ని సంపాదించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ఈయన 2012 ఒలంపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ ను కూడా గెలుచుకున్నాడు. ఇక 2013 లో ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం సాధించాడు. ఇక 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈయన తాప్సి తో ప్రేమాయణం ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం వీరి ప్రేమ కాస్త పెళ్లిగా మారనున్నట్లు తెలుస్తుంది.