ఇండస్ట్రీలో ఉండే హీరోలు కచ్చితంగా సినిమా చేయాలి అని అనుకునే వారిలో డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు కూడా చాలా సందర్భాలలో వినబడింది. ఆయనతో సినిమా అంటేనే చాలా మంది హీరోలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొద్ది మంది తోనే త్రివిక్రమ్ సినిమా చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం త్రివిక్రమ్ ఒక కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు అప్పట్లో లాక్ డౌన్ సమయంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ కుర్ర హీరో కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా త్రివిక్రమ్ పూర్తి చేసినట్లు ఇండస్ట్రీలో టాప్ గట్టిగా వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు రామ్.
2019లో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం “రెడ్” అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ఇవ్వడం జరిగింది రామ్. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమా అనేదాని ప్రాజెక్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ తో డిస్కషన్లో జరుగుతున్నాయని ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని రామ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ కచ్చితంగా సినిమా చేస్తాం అని పేర్కొన్నాడు.
అంత మాత్రమే కాక ఇంకా చాలా స్క్రిప్టులు పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే ఓకే అయిన స్క్రిప్టులు అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామ్ నటించిన రెడ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తారీకున విడుదల కానుంది. ఫస్ట్ టైం డబల్ ఫోజ్ లో రామ్ నటించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత రామ్ నటించిన సినిమా ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు.