Naga Chaitanya: సినిమా అంటేనే మాయ. ఒక సినిమాలో హీరోకి భార్యగా నటించిన హీరోయిన్ మరో సినిమాలో తల్లిలాగ నటిస్తుంది. అలాగే ఒక సినిమాలో హీరోకి చెల్లిగా నటించిన హీరోయిన్ మరో సినిమాలో వదిన లాగా నటించాల్సి ఉంటుంది. పాత్రల మధ్య ఇలా అనేక రకాల వైవిధ్యం చూపించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఒకే హీరోయిన్ ఒక హీరోకు ఓ సారి భార్యగా, మరోసారి ప్రేయసిగా.. మరో సారి చెల్లిగా కూడా నటించాల్సి రావచ్చు. ఆ పాత్రల స్వభావాన్ని బట్టి నటన ఉంటుందే కాని.. సినిమాల్లో వరుసలను బట్టి ఉండదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Naga Chaitanya: చైతన్య విషయంలో జరిగింది ఇదే:
ఈ క్రమంలో ఒక హీరోయిన్ చైతన్యకు ఫ్రెండ్‌గా, ప్రేయసిగా, తల్లిగా నటించింది. మరి ఈ యంగ్ హీరో పక్కన ఇన్ని పాత్రల్లో కనిపించిన ఆ హీరోయిన్ తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమా 2016 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు తీస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించాడు. చైతుకు జోడీగా కృతిశెట్టి నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇది చదివితే అర్ధం అవుతుంది:
బంగార్రాజులో నాగచైతన్య బంగార్రాజుకు మనవడిగా కనిపించాడు. అంటే రాము, సీత కొడుకే ఈ చిన బంగార్రాజు అంటే ఈ లెక్కన లావణ్య చైతుకు తల్లి అవుతుంది కదా. అలాగే రమ్యకృష్ణ నానమ్మ అవుతుంది. అంతకుముందే చైతు – లావణ్య కాంబినేషన్ మనం చూసాం. అంతకంటే ముందు అక్కినేని ఫ్యామిలీ సినిమా మనంలో వారు ఫ్రెండ్స్‌గా కనిపిస్తారు. అలా ఈ తరం హీరోల్లో ఒకరిగా ఉన్న చైతుకు.. ఈ జనరేషన్ హీరోయిన్ అయిన లావణ్య తల్లిగాను, ఫ్రెండ్గాను, ప్రేయసిగాను మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించడం కొసమెరుపు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!