NTR30: వరుస విజయాలతో టాప్ దర్శకుడిగా పేరొందిన కొరటాల శివ మొన్న ఆచార్య తో మొదటి పరాజయం ఎదుర్కొనడం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఈ విషయంలో కొరటాల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. మరోపక్క తారక్ తన కెరీర్ లో ఇది 30వ సినిమా కావటంతో… ఎట్టి పరిస్థితుల్లో హిట్ పడేలా అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా రాజమౌళితో చేసిన తరువాత చాలా పరాజయాలు ఎదుర్కొనే పరిస్థితి గతంలో రావటంతో… కొరటాలతో చేయబోయే ప్రాజెక్ట్ తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా గా ఉండాలని ఫ్లాప్ కాకూడదని డిసైడ్ అయ్యారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే “RRR” తో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కి భారీ క్రేజ్ ఏర్పడటం తెలిసిందే. కొమరం భీమ్ పాత్రకి భాష ప్రాంతం భేదం లేకుండా చూసే ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయ్యాడు. దీంతో “RRR” క్రేజ్ క్యాష్ చేసుకునే తరహాలో కొరటాల ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఐదు భాషలలో తెరకెక్కించడానికి డిసైడ్ అయ్యారట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో.. ఈ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేయడం జరిగిందట. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన చిన్నపాటి వీడియో అందులో ఎన్టీఆర్ పలికిన డైలాగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చిన సంగీతం.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా జరిపి.. తక్కువ టైంలోనే సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం తారక్ దాదాపు ఎనిమిది కేజీలు తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడంతో “NTR30” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి కొరటాల.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటడో లేదో చూడాలి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!