Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ అందరికి సుపరిచితుడే. 2007వ సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యి యూత్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఆ తర్వాత అనేక లవ్ స్టోరీ సినిమాలు చేయటం జరిగింది. ఎక్కువగా ప్రేమ కథ నేపథ్యంలో వరుణ్ సందేశ్ సినిమాలు చేయడం జరిగింది. కొన్నాళ్లకు వరుస ఫ్లాపులు పడటంతో వరుణ్ కి అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ త్రీ లో వరుణ్ తన భార్య వితికాతో గేమ్ ఆడటం జరిగింది. వితికా కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే. ఆమె కూడా అనేక సినిమాలు చేయటం జరిగింది. కానీ ఎక్కడ గుర్తింపు సంపాదించలేదు. బిగ్ బాస్ షోలో వరుణ్ భార్యగా గేమ్ ఆడి అప్పుడు అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని ఏంతగానో ఆకట్టుకునేది. అనంతరం అనేక తెలుగు టెలివిజన్ కార్యక్రమాలలో కూడా రావటం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా వితికా.. తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఒత్తిడి వల్ల నెల రోజుల నుంచి మెడ నొప్పి, మైగ్రేన్ తో నరకం చూస్తున్నాను. కానీ ఇక అంతా కోలుకున్న అనుకునే లోపు మళ్ళీ వ్యాధి తిరగబెట్టింది. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకొని యూట్యూబ్ లో మళ్లీ వీడియోలు చేస్తాను అంటూ…వితికా చెప్పుకొచ్చింది. మైగ్రేన్ కారణంగా విపరీతమైన తలనొప్పి వెన్నుపోటు రావటం వల్ల తాను ఏ పని చేయలేకపోతున్నట్లు అలాగే స్పాండిలైటిస్ వ్యాధికి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్లు తెలియజేసింది. మధ్యలో బాధ ఎక్కువ కావటం వల్ల నీడ్లింగ్ చికిత్స తర్వాత కాస్త ఉపశమనం పొందినట్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాను పనులు చేసుకుంటున్నట్లు పూర్తిగా కోలుకోవాలని వీడియోలో తెలిపింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!