దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారన్న విషయం ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థవువుతుంది. ‘నువ్వే నువ్వే’ నుంచి నిన్నటి ‘అరవింద సవేుత’ వరకు ప్రతి టైటిల్ క్లాస్ టచ్‌తోనే ఉంటుంది. ఆమధ్య పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని రూపొందించిన త్రివిక్రమ్ అప్పటి నుంచి ‘అ’ అక్షరాన్ని సెంటిమెంట్‌గా తీసుకున్నట్టు ఉన్నారు. ఆ సినిమా తర్వాత చేసిన సినిమాల్లో ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సవేుత’.. ఇలా అ తో మొదలయ్యే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ప్రారంభమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘అలకనంద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 24 నుంచి జరుగుతుంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!