ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ లను సెలక్ట్ చేసుకుని, దానికి తగ్గ ప్రమోషన్లు చేసుకుని, యూత్‌లో తనకు ఓ రౌడీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన `డియర్ కామ్రేడ్` ప్రస్తుతం ప్రమోషన్లతో ఫుల్ స్వింగ్‌తో ఉంది. మూవ్ అయ్యే ట్రైన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సాగే ఘాటు అధరచుంబనం ఇప్పటికీ ప్రేక్షకుల్లో హీటెక్కించి, సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇది ఇలా ఉండగానే, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన తర్వాతి సినిమా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఉంటుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ నెల 20 నుంచి ఢిల్లీలో ఈ సినిమా మొదలవుతుంది. స్పోర్ట్స్ మూవీగా ఎలివేట్ అయిన ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా నటిస్తారు. ఇందుకోసం ఆయన బైక్ రేసింగ్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. `డియర్ కామ్రేడ్` తరహాలోనే ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రూపొందించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో మాళవిక మోహనన్ నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకే `హీరో` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పనిలో పనిలో హీరో బ్రాండ్‌ను కూడా ఇంక్లూడ్ చేయనున్నట్టు టాక్.