రైటర్లు, డైరక్టర్, టెక్నీషియన్స్… ఇలా 24 శాఖల వారు కలిసి కృషి చేస్తేనే సినిమా అయ్యేది. అంత కష్ట పడి చేసినా కూడా తీరా తెరమీద చూసుకున్నాక అక్కడక్కడా ఎందుకో సరిగా ఉన్నట్టు అనిపించదు. అలాంటి సరిగా లేకపోవడాన్ని ఎడిటింగ్ రూమ్‌లోనే సరిదిద్దడం అక్కినేని నాగార్జునకు బాగా అలవాటు. ఇప్పుడు అదే అలవాటును ఆయన కోడలు సమంత కూడా ఫాలో అవుతోంది. ఆమె నటిస్తున్న తాజా సినిమా `ఓ బేబీ`ని సురేష్‌బాబుకు చూపించారట. ఆ సినిమాను ప్రైవేట్‌గా చూసిన సురేష్‌బాబు సెకండాఫ్‌లో కొన్ని చేంజెస్ చెప్పారట. దర్శకుడు నందినిరెడ్డి అండ్ టీమ్, ఇప్పుడు ఆ పనుల్లో ఉన్నారట. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కొరియన్ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో 70 ఏళ్ల వృద్ధురాలిగా సమంత నటిస్తారని ముందు వార్తలొచ్చాయి. కానీ ఆ పాత్రకు లక్ష్మీని తీసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగశౌర్య, రావు రమేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తున్నారు. జూన్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలయ్యాకగానీ సురేష్‌బాబు చెప్పిన సలహా వల్ల ప్రయోజనం ఉందా? లేదా? అనేది తెలియదు మరి.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!