NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

TDP: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇటీవల వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పోరేటర్ లు, సర్పంచ్ లు టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ, జనసేన కార్యకర్తలు హజరైయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని అన్నారు. మరింత మందికి సేవ చేయాలనే రాజకీయాల వైపు అడుగేశానని చెప్పారు. టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజల అందరి మద్దతు అవసరమని, ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్ఘపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదని అన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమని అన్నారు. సొంత డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టే మనస్థత్వం వీపీఆర్ దని చంద్రబాబు కొనియాడారు. డిప్యూటి మేయర్ రూప్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం ఇక మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోతోందని.. నెల్లూరు కార్పోరేషన్ కార్పోరేషనే ఖాళీ అయిపోతోందని తెలిపారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకు వస్తున్నారన్నారు. వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నామని అన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించే వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మన మంతా బానిసలం.. ఆయన రారాజు ..అనుకుంటున్నారని అన్నారు. వ్యక్తులను, ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇచ్చే పార్టీ టీడీపీ అని అన్నారు. అహంకారంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆ బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N